తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా సాయంతో ఇరాన్​లో అణు రియాక్టర్​ పనులు ప్రారంభం - iran and russia news

2015 అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగి.. పలు ఆక్షలు విధించిన నేపథ్యంలో అణు ఇంధన వాడకంపై మరో కీలక ముందడుగు వేసింది ఇరాన్​. బషెహర్​ న్యూక్లియర్ పవర్ ప్లాంట్​ రెండో రియాక్టర్​ నిర్మాణ పనులను రష్యాతో కలిసి సంయుక్తంగా ప్రారంభించింది. విద్యుత్తు ఉత్పత్తికి అణు ఇంధనం వాడకంపై ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.

ఇరాన్​లో అణు రియాక్టర్​ పనులు ప్రారంభం

By

Published : Nov 11, 2019, 9:51 AM IST

ఇరాన్​లోని బుషెహర్​ ప్రాంతంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్​లో రెండో అణు రియాక్టర్​ నిర్మాణ పనులను రష్యాతో కలిసి ప్రారంభించింది ఇరాన్​. ఆ దేశ అణు శక్తి సంస్థ అధ్యక్షుడు అలీ అక్బర్ సాలేహీ, రష్యా రోసాటామ్ న్యూక్లియర్ ఏజెన్సీ ఉపాధ్యక్షుడు అలెగ్జాండర్ లోక్షిన్.. ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.

అణు ఇంధన ఒప్పందం-2015 ఇరాన్​కు అనుకూలంగా ఉందంటూ 2018, మేలో ఒప్పందం నుంచి వైదొలిగింది అమెరికా. ఇరాన్​పై పలు ఆంక్షలు విధించింది. అణు ఇంధనం విద్యుత్తు ఉత్పతికి వినియోగించుకునే విషయంపై ఆంక్షలు లేవని తెలిపింది ఇరాన్​. ఈ క్రమంలో కీలక ముందడుగు వేసింది.

ప్రత్యామ్నాయంగా..

ముడి చమురు, గ్యాస్​లపై ఆధారపడకుండా విద్యుత్​ ఉత్పత్తి చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ప్రత్యామ్నాయంగా న్యూక్లియర్​ ప్లాంట్​లను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకుంది. 2027-28 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 3,000 మెగా వాట్ల అణు విద్యుత్​ ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

బుషెహర్​లో ప్రస్తుతం ఉన్న వెయ్యి మెగావాట్ల అణు రియాక్టర్​ను రష్యా నిర్మించింది. ఇది 2011 లో ప్రారంభమైంది. 2015లో రష్యా సహా​ ఆరు దేశాలతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇరాన్. ఇందులో భాగంగా అణు విద్యుత్​ ఉత్పత్తి కోసం రియాక్టర్లకు అవసరమయ్యే ఇంధనాన్ని రష్యా ఇరాన్​కు సరఫరా చేస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details