తెలంగాణ

telangana

అమెరికాకు ఇరాన్​ 'అణు' హెచ్చరిక

ఇరాన్​పై ఆంక్షలు తొలగించేది లేదంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్​ మంత్రి అగ్రరాజ్యాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆంక్షలు తొలగించకపోతే ఇరాన్​ అణ్వాయుధాలు రూపొందించేందుకు సిద్ధమవుతుందని పేర్కొన్నారు.

By

Published : Feb 9, 2021, 6:54 PM IST

Published : Feb 9, 2021, 6:54 PM IST

iran, america
అమెరికాకు ఇరాన్​ మంత్రి హెచ్చరిక

ఇరాన్​ నిఘా శాఖ మంత్రి మహమ్మద్ అలవీ అమెరికాను హెచ్చరించారు. తమ దేశంపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగిస్తే అణ్వాయుధాలు తయారు చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. ఇరాన్​ అణు ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"సుప్రీం లీడర్​ రూపొందించిన ఫత్వా ప్రకారం అణు ఒప్పందాన్ని పాటిస్తున్నాము. కానీ ఇరాన్​ను అణ్వాయుధాలు రూపొందించే దిశగా వారు ప్రేరేపిస్తే అది మా తప్పు కాదు."

-మహమ్మద్ అలవీ, నిఘా శాఖ మంత్రి

ఇదీ చదవండి :ఇరాన్​పై ఆంక్షలు తొలగించే ప్రసక్తే లేదు: బైడెన్​

ABOUT THE AUTHOR

...view details