సౌదీ అరేబియా చమురు ప్లాంట్లపై దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తూ... అమెరికాకు దౌత్యపరమైన నోటీసులు పంపించింది ఇరాన్. తమపై ఎలాంటి చర్యలకైనా పాల్పడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని అగ్రరాజ్యానికి స్పష్టం చేసింది.
చమురు ప్లాంట్లపై శనివారం జరిగిన డ్రోన్ దాడి ఇరాన్ పనేనని అమెరికా పదేపదే ఆరోపిస్తున్న తరుణంలో ఈ నోటీసులను తెహ్రాన్‌లోని స్విస్ రాయబారి చేత అగ్రరాజ్యానికి అందజేసింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్ల 1980 నుంచి స్విస్ రాయబారితోనేఅగ్రరాజ్యం.. ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతోంది .