తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాపై యుద్ధం కోసం రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ

కరోనా వైరస్​తో ఇరాన్​లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 63మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 354మంది మరణించారు. వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 9వేలకు చేరింది. కరోనాపై పోరాటం కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దమైంది ఇటలీ.

Iran announces 63 new virus deaths, taking total to 354
ఇరాన్​లో పెరిగిన మరణాలు- ఇటలీలో ఆర్థిక అస్త్రం

By

Published : Mar 11, 2020, 6:52 PM IST

కరోనా వైరస్​తో ఇరాన్​ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గడిచిన 24 గంటల్లో వైరస్​ వల్ల 63మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో మృతుల సంఖ్య 354కు చేరింది. ఇంత మొత్తంలో మరణాలు సంభవించడం ఇరాన్​లో ఇదే తొలిసారి.

"తాజా నివేదికల ప్రకారం 958మందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 9వేలకు చేరింది. గడిచిన 24గంటల్లో 63మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకు 354మంది ప్రాణాలు కోల్పోయారు."

--- ఇరాన్​ ఆరోగ్యశాఖ.

అధికారికంగా దేశంలో ఇంకా ఎలాంటి నిర్బంధం విధించలేదు ఇరాన్​ ప్రభుత్వం. అయితే ఇతర ప్రాంతాల్లో పర్యటించవద్దని ప్రజలకు సూచించింది. వైరస్​ భయంతో ఆ దేశంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి.

ఇటలీలో భారీ ప్యాకేజీ...

వైరస్​ కేంద్రబిందువైన చైనా అనంతరం.. ఇటలీలోనే కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే ఆ దేశంలో 631మంది వైరస్​తో మరణించారు. మరో 10వేలకుపైగా మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో మహమ్మారిపై పోరుకు 25 బిలియన్​ డాలర్ల( సుమారు రూ. 2 లక్ష కోట్లు)ను ఖర్చు చేసే విధంగా ప్రణాళికను రచించింది ఇటలీ ప్రభుత్వం. ఈ మొత్తంలోని సగం.. తక్షణమే వినియోగించనున్నట్టు ఇటలీ ఆర్థికమంత్రి రొబెర్టో గౌల్టియరి తెలిపారు. మిగిలిన వనరులను అత్యవసర పరిస్థితుల కోసం కేటాయించినట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-కరోనాను గుర్తించేందుకు ఆ 5 రోజులు చాలు!

ABOUT THE AUTHOR

...view details