సిరియాలో ఉన్న ఇరాన్ సైనిక స్థావరాలు, ఆయుధగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బుధవారం.. వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో జవాన్లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. డీర్ ఆల్ జో పట్టణ ప్రాంతంలో 18 వైమానిక దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ దాడిలో 40 మంది ప్రజలు మృతి చెందారని, 37 మందికి గాయలైనట్లు బ్రిటన్- సిరియా మానవహక్కుల సంస్థ తెలిపింది. మృతుల్లో 9 మంది సైనికులున్నారని పేర్కొంది.
అమెరికా ఇచ్చిన సమాచారం మేరకే ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందని యూఎస్‌కు చెందిన ఓ నిఘా అధికారి వెల్లడించారు. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ ఇలా దాడులు చేస్తుందని తెలిపారు. ఇరాన్‌కు సంబంధించిన ఆయుధాల్ని సిరియా ఆయుధగారాల్లో ఉంచినందుకే దాడులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ చేపట్టనున్న అణు పరీక్షలకు కావల్సిన సామగ్రిని అక్కడి ఆయుధ స్థావరాల్లోని పైప్‌లైన్ ద్వారా చేరవేస్తున్నారని వెల్లడించారు.