తలలు అతుక్కుని జన్మించిన అవిభక్త కవలలకు శస్త్ర చికిత్స చేయడంలో ప్రపంచంలోనే ప్రముఖ వైద్యుడిగా పేరొందిన భారత సంతతికి చెందిన బ్రిటన్ వైద్యుడు నూర్ ఒవాసి జిలాని (Noor Owase Jeelani)... ఇజ్రాయెల్ డాక్టర్లకు సాయం చేశారు. కశ్మీర్‌లో జన్మించిన జిలాని... లండన్‌లోని గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ ఆస్పత్రిలో (The great ormond street hospital) పీడియాట్రిక్ న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ వైద్యులు ఆయన్ని సంప్రదించారు. తమ దేశంలో తలలు అతుక్కొని పుట్టిన అవిభక్త కవలలకు (Israel conjoined twins) శస్త్రచికిత్స చేసేందుకు సహకరించాలని అభ్యర్థించారు.
'కశ్మీరీ' వైద్యుడి సాయం.. ఇజ్రాయెల్ వెళ్లి శస్త్రచికిత్స! - శస్త్రచికిత్స అవిభక్త కవలలు
ఇజ్రాయెల్‌లో పుట్టిన అవిభక్త కవలలకు (Israel conjoined twins) శస్త్రచికిత్స చేసి విడదీసేందుకు భారత సంతతికి చెందిన బ్రిటన్ వైద్యుడు సహకరించారు. లండన్‌లో ఉండే ఆయన.. ఇజ్రాయెల్ వెళ్లి మరీ సాయం చేశారు.
దీంతో జిలాని.. ఇజ్రాయెల్ వెళ్లి విజయవంతంగా ఆ చిన్నారులను (Israel conjoined twins separated) విడదీశారు. "కశ్మీర్‌లో జన్మించిన ముస్లిం వైద్యుడిగా తాను ఇజ్రాయెల్ వైద్యులతో కలిసి.. ఓ యూదు కుటుంబానికి సాయం చేశాను. ఇది వైద్యం.. విశ్వజనీన భావనను తెలుపుతుంది. వైద్యపరంగా మనుషులంతా ఒకటే" అని జిలాని పేర్కొన్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిన తర్వాత ఆ యూదు కుటుంబం ఆనందానికి అవధుల్లేవని జిలాని తెలిపారు.
ఇదీ చదవండి:ఆసీస్‌లో భారతీయం- సుప్రీంకోర్టు జడ్జిగా హమెంట్ ధన్జీ