యూఏఈలో మరో ప్రవాస భారతీయుడిని అదృష్టం తలుపు తట్టింది. దుబాయిలో నిర్వహించిన లక్కీడ్రాలో ఆరు అంకెలకుగాను ఐదు అంకెలను పొంది.. శివిన్ విల్సన్ అనే ఇంజనీర్.. ప్రైజ్‌మనీగా రూ.39,75,835 గెలుచుకున్నాడు.
ఇండియాలోని కేరళకు చెందిన శివిన్.. దుబాయ్‌లోని ఓ పెట్రో కెమికల్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా జనవరి 16న తీసిన లక్కీడ్రాలో రూ.39,75,835 గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. తోటి స్నేహితుల ప్రోత్సాహంతోనే తను ఈ లాటరీలో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ డబ్బును తన విద్యావసరాలకోసం, తల్లిదండ్లుల బాగోగులకోసం ఉపయోగించనున్నట్లు తెలిపాడు. కాగా లక్కీడ్రా మొదటి ప్రైజ్ కింద రూ.99,30,63,160 నిర్వాహకులు ఇవ్వనున్నారు.