తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రధాని మోదీకి బహ్రెయిన్​ విశిష్ట పురస్కారం - నరేంద్రమోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహ్రెయిన్ విశిష్ట పురస్కారం 'ది కింగ్ హమాద్ ఆర్డర్​ ఆఫ్ రెనాయిసన్స్'తో గౌరవించింది ఆ దేశ ప్రభుత్వం. భారత ప్రధాని బహ్రెయిన్​లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

మోదీకి బహ్రెయిన్​ అత్యున్నత పౌర పురస్కారం

By

Published : Aug 25, 2019, 5:05 AM IST

Updated : Sep 28, 2019, 4:27 AM IST

ప్రధాని మోదీకి బహ్రెయిన్​ విశిష్ట పురస్కారం

'ది కింగ్ హమాద్ ఆర్డర్​ ఆఫ్ రెనాయిసన్స్' పురస్కారం తనకు, భారత ప్రజలందరికీ దక్కిన అరుదైన గౌరవమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మూడు దేశాల పర్యటనలో భాగంగా బహ్రెయిన్​ను సందర్శించిన మోదీని ఆ దేశం సర్కారు విశిష్ట పురస్కారంతో సత్కరించింది.

భారత ప్రధాని బహ్రెయిన్​ను సందర్శించడం ఇదే తొలిసారి. ఆ దేశ రాజు హమాద్ బిన్ ఈసా అల్​ ఖలిఫాతో సమావేశమయ్యారు మోదీ. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు.

'ది కింగ్ హమాద్ ఆర్డర్ ఆఫ్ రెనాయిసాన్స్' పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు మోదీ. ఇది భారత ప్రజలందరికీ దక్కిన గౌరవంగా అభివర్ణించారు.

బహ్రెయిన్​

"'ది కింగ్ హమాద్ ఆర్డర్​ ఆఫ్ రెనాయిసాన్స్' పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నా. బహ్రెయిన్​తో భారత మైత్రికి ఇది ఓ గుర్తింపు. వందల ఏళ్లుగా వెనుకబడిన స్నేహం 21వ శతాబ్దంలో దూసుకెళ్తుంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

అనంతరం బెహ్రెయిన్​ యువరాజు ఖలిఫా బిన్ సల్మాన్​ అల్​ ఖలిఫాతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-బహ్రెయిన్​ మధ్య సత్సంబంధాలు, ఇరు దేశాల ప్రజలకు మేలు జరిగే అంశాలపై చర్చించామని మరో ట్వీట్​ చేశారు మోదీ.

  • మోదీ బహ్రెయిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష సాంకేతికత, సౌరశక్తి, సాంస్కృతిక భాగస్వామ్యం దిశగా పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), బహ్రెయిన్ జాతీయ అంతరిక్ష సంస్థ మధ్య సాంకేతిక సహకారం కోసం అవగాహన.
  • అంతర్జాతీయ సౌర కూటమిలో బహ్రెయిన్​ చేరేందుకు ఇరు దేశాల అంగీకారం. ఈ కూటమి 2015లో జరిగిన ఐరాస వాతావరణ మార్పు సమావేశం వేదికగా... నరేంద్రమోదీ, నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఏర్పాటుచేశారు.
  • ఇరు దేశాల మధ్య సాంస్కృతిక భాగస్వామ్యం ఏర్పాటుపై అవగాహన ఒప్పందం.
Last Updated : Sep 28, 2019, 4:27 AM IST

ABOUT THE AUTHOR

...view details