2015 అణు ఒప్పందానికి తూట్లుపొడుస్తూ.. యురేనియం ఉత్పత్తిని ప్రారంభించింది ఇరాన్. ఈ విషయాన్ని ఐరాసకు చెందిన ఇంటర్నెషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) ప్రకటించింది.
3.6 గ్రాముల యురేనియం.. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్లాంటులో ఉత్పత్తి అయినట్టు ఐరాస సభ్య దేశాలకు వెల్లడించారు ఐఏఈఏ అధిపతి రఫేల్ గ్రాస్సి. తమ అధికారులు ఈ విషయాన్ని ఈ నెల 8న ధ్రువీకరించినట్టు పేర్కొన్నారు.
ఒప్పందానికి తూట్లు..
యురేనియంపై పరిశోధనలు చేయబోమని 2015లో అణు ఒప్పందంపై సంతకం చేసింది ఇరాన్. అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఈ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో భాగస్వాములుగా ఉన్నాయి. అణుబాంబు తయారీలో దీనిని ఉపయోగించే అవకాశం ఉండటం వల్లే.. ఇరాన్ చర్యలను నిషేధించడానికి ఈ ఒప్పందాన్ని ప్రతిపాదించాయి ప్రపంచ దేశాలు.