టర్కీలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూలో శనివారం తెల్లవారుజామున ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 9 మంది కొవిడ్ బాధితులు మృతి చెందారు. వీరంతా 56 నుంచి 85 ఏళ్ల వయసున్నవారేనని ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. ఐసీయూలో చికిత్స పొందుతున్నవారిని ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించింది.
టర్కీలో ఆక్సిజన్ సిలిండర్ పేలి 9 మంది మృతి
టర్కీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది. ఐసీయూలో జరిగిన ఈ ఘటనలో 9 మంది కరోనా బాధితులు మరణించారు. ఇతర రోగులను వేరే ఆస్పత్రులకు తరలించారు.
టర్కీ ఆస్పత్రి
ఘటన జరిగిన సమయంలో అక్కడి యూనిట్లో 19 మంది బాధితులు ఉన్నారని అధికారులు తెలిపారు. మృతులు మినహా ఇంకెవరికీ గాయాలు కాలేదని చెప్పారు.
కరోనా తీవ్రత కారణంగా టర్కీలోని ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఐసీయూ విభాగాలు 74 శాతం ఆక్యుపెన్సీతో పనిచేస్తున్నాయి.
TAGGED:
Turkey hospital fire