భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది అమెరికా. ఇరాన్‌పై విధించిన చమురు ఆంక్షల విషయంలో అగ్రరాజ్యానికి భారత్ గొప్ప సహకారం అందించిందని కొనియాడింది. మిత్రదేశం వ్యహరించిన తీరు ఎంతో సంతృప్తినిచ్చిందని హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది శ్వేతసౌధం.
ఇరాన్ విదేశాంగ మంత్రి జరీఫ్ పైన బుధవారం నుంచి ఆంక్షలు విధించింది అమెరికా. జరీఫ్ అంతర్జాతీయ ప్రయాణాలపై షరతులు విధించింది. అమెరికాలోని అతని ఆస్తులను స్తంభింపజేసింది. 2015లో ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదలిగినప్పటి నుంచి ఆ దేశంపై ఆంక్షల వర్షం కురిపిస్తోంది అమెరికా.
ఈ ఏడాది మే వరకు భారత్ సహా 8 దేశాలకు ఇరాన్ నుంచి చమురు దిగుమతికి అనుమతిచ్చింది అమెరికా. ఆ తరువాతి నెల నుంచి దిగుమతులు చేసుకోవద్దని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు చమురు దిగుమతులను నిలిపి వేసింది భారత్.