తెలంగాణ

telangana

ETV Bharat / international

నెతన్యాహును గద్దె దించేందుకు రంగం సిద్ధం!

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు తగిన మెజారిటీ ఉందని ఇజ్రాయెల్​ ప్రతిపక్ష నేత (సెంట్రిస్ట్​ యెష్​ అతిద్ పార్టీ)​ ఆ దేశ అధ్యక్షుడికి వెల్లడించారు. తమకు మరో ఏడు పార్టీల మద్దతు ఉందని తెలిపారు. ఈ విషయంపై స్పీకర్​కు కూడా లాపిడ్​ సమాచారం అందించారు.

israel lapid, ఇజ్రాయెల్​ ప్రధాని
ప్రభుత్వ ఏర్పాటుపై లాపిడ్​ ప్రకటన

By

Published : Jun 3, 2021, 11:05 AM IST

కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చట్టసభ్యుల నుంచి తమకు సరిపడా మద్దతు ఉందని ప్రకటించారు ఇజ్రాయెల్​ ప్రతిపక్ష నేత, సెంట్రిస్ట్​ యెష్​ అటిడ్​ పార్టీకి చెందిన యాయిర్ లాపిడ్. ఈ విషయాన్ని అధ్యక్షుడు రివ్లిన్​కు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇచ్చిన గడువు మరో అరగంటలో ముగుస్తుందనగా లాపిడ్​ ఈ ప్రకటన చేయడం గమనార్హం. తమకు యేష్​ అతిద్​, కహోల్​ లావన్, ఇజ్రాయెల్​ బైటెన్యూ, లేబర్​, యామినా, న్యూహోప్​, మేరెట్జ్​, రామ్​ పార్టీల మద్దతు ఉందని లాపిడ్​.. అధ్యక్షుడికి వెల్లడించారు.

యామినా పార్టీ నేత నాఫ్తాలీ బెన్నెట్​ ప్రధానిగా ముందు బాధ్యతలు చేపడతారని లాపిడ్​.. అధ్యక్షుడికి స్పష్టం చేశారు. చెరో రెండేళ్లు అధికారం పంచుకునే విధంగా ఇరువురూ ఒప్పందం కుదుర్చుకున్నారు.

లాపిడ్​ ప్రకటనపై అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తున్నందుకు లాపిడ్​ సహా మద్దతుగా నిలిచిన పార్టీలకు అభినందనలు తెలిపారు.

ప్రభుత్వ ఏర్పాటుపై స్పీకర్​కు కూడా లాపిడ్​ సమాచారం అందించారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటుపై పార్లమెంటు సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 120 సీట్లున్న ఇజ్రాయెల్ పార్లమెంట్​లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 61మంది సభ్యుల మద్దతు అవసరం.

ఇదీ చదవండి :12 ఏళ్ల తర్వాత గద్దె దిగనున్న నెతన్యాహు!

ABOUT THE AUTHOR

...view details