గతేడాది డిసెంబర్‌లో చైనాలో బయటపడ్డ కొవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. కొన్ని రోజుల్లోనే ప్రపంచదేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. ఇప్పటివరకు లక్షల మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా నిత్యం రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3కోట్ల 4లక్షల మందికిపైగా కొవిడ్ సోకింది. వీరిలో ఇప్పటివరకు 9లక్షల 51వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
చైనాలో మొదలై..
చైనాలో ప్రారంభమైన వైరస్ విజృంభణ.. ఆ తర్వాత యూరప్‌లో కొనసాగింది. అనంతరం అమెరికాలో విస్తరించి ఇప్పటికీ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం యూరప్‌లో కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఉత్తర, దక్షిణ అమెరికాలతోపాటు భారత్‌లోనూ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న టాప్-5 దేశాలివే..
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 68,78,222 | 2,02,274 |
భారత్ | 52,28,478 | 84,505 |
బ్రెజిల్ | 44,57,443 | 1,35,031 |
రష్యా | 10,91,186 | 19,195 |
పెరూ | 7,50,098 | 31,146 |