గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో మృతుల సంఖ్య 43కు చేరింది. ఇందులో 13 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య సోమవారం నుంచి ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 300 మంది పాలస్తీన వాసులు గాయపడ్డారని తెలిపింది.
43కు చేరిన గాజా మృతుల సంఖ్య - ఇజ్రాయెల్ దాడుల్లో గాజా మృతులు
గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు 43మంది మృతి చెందారు. ఇందులో 13 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దాడులు
పాలస్తీనా నిరసనకారులకు, ఇజ్రాయెల్ పోలీసులకు మధ్య తాజాగా జరిగిన ఘర్షణలతో మళ్లీ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రంజాన్ ప్రార్థనల కోసం జెరూసలెం వెళ్తున్న యాత్రికుల బస్సులను పోలీసులు అడ్డుకోవడం కారణంగా ఈ ఘర్షణలు మళ్లీ ప్రారంభమయ్యాయి