ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలో ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పాలస్తీనా ఉగ్రవాదులు గాజా, ఇజ్రాయెల్ నుంచి డజన్ల కొద్దీ రాకెట్లను మంగళవారం తెల్లవారుజామున ప్రయోగించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. 700 మంది పాలస్తీనీయులు గాయపడ్డారు. 500మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇంతేగాక 15 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో మరణించారని చెప్పారు.
ఇస్లాం, జడాయిజం, క్రైస్తవ మతాల వారికి ఏంతో పవిత్ర స్థలమైన జెరూసలెంపై సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవాలని చూడడం వల్ల ఎప్పటిలాగే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. స్థానిక అల్-అక్సా మసీదు ప్రాంగణంలో నివాసం ఉంటున్న పాలస్తానీయులు ఇళ్లు ఖాళీ చేయాలని పోలీసులు కోరడం కారణంగా ఇజ్రాయెల్ పోలీసులకు, పాలస్తీనా వారికి ఘర్షణలు తలెత్తాయి.