తెలంగాణ

telangana

ETV Bharat / international

పేలిన ఆక్సిజన్​ సిలిండర్లు- 19 మంది​ రోగులు మృతి! - ఇబ్న్​ అల్​-ఖతీబ్​ ఆస్పత్రి

ఇరాక్​లోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్​ సిలిండర్​ పేలి.. భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది కరోనా రోగులు మృతి చెందగా.. మరో 36 మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆస్పత్రి వైద్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.

Fire broke out in hospital
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

By

Published : Apr 25, 2021, 9:18 AM IST

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లోని ఓ ఆస్పత్రిలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది కొవిడ్​ రోగులు చనిపోయినట్లు తెలుస్తోంది. ​ఇబ్న్​ అల్​-ఖతీబ్​ ఆస్పత్రిలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 36 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే దీనిపై ఇరాక్​ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

అగ్ని ప్రమాదం సంభవించిన ఆస్పత్రి
రోగులను తరలిస్తున్న సిబ్బంది
మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
దగ్ధమైన ఆస్పత్రి కిటికీలు
కాలిపోయిన ఆస్పత్రి కిటికీ

ప్రమాద సమయంలో 120 మంది రోగులు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిలో ఓ ఆక్సిజన్​ సిలిండర్​ పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని.. ఇద్దరు వైద్యులు ఈ ఘటనను చూసినట్లు చెప్పారని అధికారులు తెలిపారు. ఆస్పత్రి వర్గాలు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపు చేశారు. సహాయకచర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:అమెరికాలో కాల్పులు.. ఆరుగురు దుండగులు మృతి

ABOUT THE AUTHOR

...view details