ప్రపంచంలోని అతిపెద్ద పోర్టులలో ఒకటైన దుబాయ్ జెబెల్ అలీ పోర్టులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో కంటైనర్ ఓడలో భారీగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఈ క్రమంలో పెద్ద శబ్దాలు రావడం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
అయితే.. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం తెల్లవారుజామునకు మంటలు పూర్తిగా అదుపు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.