తెలంగాణ

telangana

ETV Bharat / international

కొత్త ప్రభుత్వంతో ఇజ్రాయెల్​ పునర్నిర్మాణం జరిగేనా? - ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

ఇజ్రాయెల్​లో కొత్త శకం మొదలైంది. 12ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బెంజమిన్ నెతన్యాహు పాలనకు తెరదించుతూ ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్ అధికారాన్ని చేపట్టారు. మరి ఎనిమిది పార్టీల కూటమిగా ఏర్పడిన ఈ ప్రభుత్వంతో ఏళ్లనాటి రాజకీయ సంక్షోభం ముగిసేనా ? దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణలకు చరమగీతం పాడుతుందా? ఇజ్రాయెల్​లో అంతర్గతంగా నెలకొన్న యూదులు, పాలస్తీనీయుల మధ్య కలహాలు సద్దుమణుగుతాయా?..

Israel
ఇజ్రాయెల్

By

Published : Jun 14, 2021, 11:48 AM IST

ఇజ్రాయెల్​లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 12 ఏళ్ల పాలన ముగిసింది. ఒకప్పటి ఆయన అనుచరుడు నాఫ్తాలి బెన్నెట్(49) నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మరి ఏళ్ల తరబడి కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, ఘర్షణలు, అభివృద్ధి లేమిని కొత్తగా కొలువుదీరిన బెన్నెట్ ప్రభుత్వం అధిగమిస్తుందా?

బడ్జెట్​పై ప్రథమంగా దృష్టి!..

ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద లక్ష్యం.. విజయవంతంగా బడ్జెట్​ను ప్రవేశపెట్టటం.. 2019 నుంచి ఇజ్రాయెల్​లో బడ్జెట్ ఊసే లేదు. ఆర్థిక సంస్కరణలు, మౌలిక వసతుల కల్పనపై బెన్నెట్​ సర్కార్.. దృష్టి సారించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్​లోని యూదులు, ఇస్లాం మతస్థులను సంతృప్తి పరచేవిధంగా బడ్జెట్ రూపొందించే వీలుంది.

చెరో రెండేళ్లు..

నాఫ్తాలీ బెన్నెట్ ఇజ్రాయెల్ ప్రధానిగా రెండేళ్లు కొనసాగనున్నారు. మరో రెండేళ్లు.. మాజీ జర్నలిస్టు యేర్ లపిడ్ ప్రధాని పదవిని చేపట్టనున్నారు. కానీ భిన్న సిద్ధాంతాలు కలిగిన ఎనిమిది పార్టీలతో ఏర్పడిన ఈ ప్రభుత్వం అప్పటివరకు కొనసాగుతుందా? అన్న అనుమానాలు లేకపోలేదు.

ఇదీ చదవండి :నెతన్యాహును గద్దె దించేందుకు రంగం సిద్ధం!

పాలస్తీనా- ఇజ్రాయెల్ ఘర్షణలు సద్దుమణిగేనా?

నాఫ్తాలీ బెన్నెట్.. స్వతహాగా పాలస్తీనాకు వ్యతిరేకం. అయితే.. దశాబ్దాలుగా సాగుతున్న పాలస్తీనా- ఇజ్రాయెల్ ఘర్షణల విషయంలో మాజీ ప్రధాని నెతన్యాహు బాటలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్ట్​ బ్యాంక్​ ఆక్రమణ, గాజాపై దాడులు.. బెన్నెట్ కార్యచరణలో లేవు. ఇది పాలస్తీనాకు కలిసొచ్చే అంశం..

ఇదీ చదవండి :ఇజ్రాయెల్​లో రాజకీయ సంక్షోభం ముగిసేదెప్పుడు?

అణు ఒప్పందానికి నో!..

ఇరాన్​ విషయంలో నెతన్యాహులానే బెన్నెట్.. తటస్థ వైఖరి కొనసాగించవచ్చు. అరబ్​ దేశాలతో ఉన్న సంబంధాలను బలోపేతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో కలిసి పనిచేయనున్నట్లు ఇటీవల ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే బైడెన్.. పున:పరిశీలించే అంతర్జాతీయ అణు ఒప్పందానికి మాత్రం బెన్నెట్​ సర్కార్​.. మద్దతు ఇచ్చే అవకాశం లేదు.

ఇదీ చదవండి :ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్

అంతర్గత కలహాల పరిస్థితేంటి?

దశాబ్దాలుగా యూదులు, పాలస్తీనీయుల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను సద్దుమణిగించటంలో నెతన్యాహు ప్రభుత్వం విఫలమవుతూ వస్తోంది. అయితే సిద్ధాంతాలు, మతాలు అన్న భిన్నత్వం లేకుండా అందరికోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని బెన్నెట్ ఇటీవల స్పష్టం చేయటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

బెన్నెట్​ ప్రభుత్వంలో .. అరబ్బులకు ప్రాతినిధ్యం వహించే చిన్న పార్టీ కూడా ఉంది. ఇజ్రాయెల్​లో అరబ్బులు 20 శాతం ఉన్నారు. దీంతో వీరు వివక్షకు గురవుతున్నారు. అయితే వీరి హక్కులు, అభివృద్ధి కోసం అరబ్బుల పార్టీ.. దృష్టి సారించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి :12 ఏళ్ల తర్వాత గద్దె దిగనున్న నెతన్యాహు!

'ఇజ్రాయెల్ కింగ్' తిరిగొస్తారా?

మాజీ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుకు 'కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్' అని పేరుంది. 30 సీట్లతో ఇప్పటికీ అతిపెద్ద పార్టీగా ఉన్న 'లికుడ్​'కు నేతృత్వం వహిస్తున్న నెతన్యాహు ప్రస్తుతం విపక్ష నేత పాత్రను పోషిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.

ఏదేమైనా.. నెతన్యాహు గూటినుంచే వచ్చిన బెన్నెట్​.. ఇజ్రాయెల్ ప్రధాన సమస్యలపై మాజీ ప్రధాని బాటలోనే నడిచేట్టు కనిపిస్తోంది.

ఇదీ చదవండి :ఇజ్రాయెల్​ నూతన ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్

ABOUT THE AUTHOR

...view details