ఉత్తర ఈజిప్టు అల్ క్వాలిబియా పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, మరో 23 మంది గాయపడినట్లు అక్కడి ఉన్నతాధికారులు తెలిపారు.
వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం-20మంది మృతి - ఈజిప్టు
ఈజిప్టులోని ఓ వస్త్రదుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20మంది మృతి చెందారు. మరో 24మంది గాయపడ్డారు.
వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం-20మంది మృతి
అల్ క్వాలిబియా పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది మంటల్లో చిక్కుకుపోయారు. మరికొందరు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:ఐరాస విజ్ఞప్తి బేఖాతరు- పది మంది కాల్చివేత