ఈజిప్ట్ రాజధాని కైరోకు దక్షిణంగా ఉన్న పారోనిక్ నెక్రోపోలిస్‌లో దాదాపు 100 పురాతన శవపేటికలను ఆ దేశ పురావస్తు అధికారులు కనుగొన్నారు. బయటపడిన శవ పేటికలను తెరిచిన అధికారులు ఎంతో జాగ్రత్తగా సంరక్షించిన మమ్మీలను గుర్తించారు. మమ్మీల గురించి మరింత శోధించేందుకు అధికారులు ఎక్స్‌రే తీశారు.
ఈజిప్ట్‌లో బయటపడ్డ 300ఏళ్లనాటి శవపేటికలు
ఈజిప్ట్ రాజధాని కైరోలో దాదాపు 100 పురాతన శవపేటికలను అధికారులు కనుగొన్నారు. బయటపడిన మమ్మీలు సుమారు 300 ఏళ్ల క్రితం ఈజిప్ట్‌ని పరిపాలించిన టోలెమిక్ రాజవంశానికి చెందినవని ఈజిప్ట్ మంత్రి ఖలీద్ ఎల్ అనానీ తెలిపారు.
ఈజిప్ట్‌లో బయటపడ్డ 300ఏళ్లనాటి శవపేటికలు
బయటపడిన మమ్మీలు సుమారు 300 ఏళ్ల క్రితం ఈజిప్ట్‌ని పరిపాలించిన టోలెమిక్ రాజవంశానికి చెందినవని ఆ దేశ పర్యటక, పురావస్తు శాఖ మంత్రి ఖలీద్ ఎల్ అనానీ తెలిపారు. ఈ శవపేటికల్లో కొన్ని మమ్మీలు, 40 వరకు గిల్డెడ్ విగ్రహాలు ఉన్నాయని వెల్లడించారు. వీటన్నింటినీ ప్రఖ్యాత గిజా పిరమిడ్ల సమీపంలో నిర్మిస్తున్న గ్రాండ్ ఈజిప్టియన్ మ్యూజియంతో పాటు మరో మూడు చోట్ల ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.