ఉత్తర టర్కీలోని ఎలాజిగ్ రాష్ట్రంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల తరువాత భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాజిగ్ పక్క రాష్ట్రాలలో కూడా స్వల్పంగా భూమికంపించినట్లు తెలిపారు.
టర్కీలో భూకంపం- రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత - టర్కీ
టర్కీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ మంత్రి వెల్లడించారు.
5.3 తీవ్రతతో కంపించిన భూమి
టర్కీలో భూకంపాలు తరచుగా వస్తుంటాయి. జనవరిలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ఎలాజిగ్, మలాతియా రాష్ట్రాలలో41 మంది మృతి చెందారు. ఇజ్మీర్ పట్టణంలో అక్టోబర్లో వచ్చిన భూకంపంలో 116 మంది మృత్యువాత పడ్డారు.
ఇదీ చూడండి:టర్కీలో భూకంపం- 5.0 తీవ్రత నమోదు