కరోనా ఉద్ధృతి తగ్గుతున్నవేళ.. యూఏఈ ప్రయాణ ఆంక్షలను సడలించింది. భారత్ నుంచి రెసిడెన్స్ వీసాతో దుబాయ్ వచ్చే ప్రయాణికులను ఈ నెల 23 నుంచి అనుమతించాలని నిర్ణయించింది. అయితే తాము అనుమతించిన టీకాల రెండు డోసులు తీసుకొని ఉండాలని షరతు విధించింది. ఆ దేశ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గల్ఫ్ మీడియా వెల్లడించింది.
ఆ దేశాలకే..
దక్షిణాఫ్రికా, నైజీరియా, భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం యూఏఈ ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. భారత్‌కు సంబంధించి రెసిడెన్స్ వీసా కలిగి ఉండి, తాము ఆమోదించిన టీకా రెండు డోసులు తీసుకున్న వారిని మాత్రమే అనుమతించనున్నట్లు యూఏఈ స్పష్టం చేసింది.