తెలంగాణ

telangana

ETV Bharat / international

గ్రీటింగ్​ కార్డుతో గిన్నిస్​ రికార్డ్​! - guinness record ramkumar in dubai

దుబాయ్​లో ఉండే ఓ భారతీయుడు సరికొత్త రీతిలో ప్రయత్నించి గిన్నిస్​ రికార్డుల్లోకి ఎక్కారు. ఆ దేశ ప్రధాని అధికారం చేపట్టి 15ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ గ్రీటింగ్​ కార్డుతో శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకోసం రూపొందించిన 8.2 చదరపు మీటర్ల గ్రీటింగ్​ కార్డుతో గిన్నిస్​ రికార్డులకెక్కారు రాంకుమార్​.

Dubai based NRI Ramkumar Sarangapani became in to Guinness World Records by creating 8.2 square meters greeting card
భారీ గ్రీటింగ్​ కార్డుతో గిన్నిస్​లోకి ప్రవాసి

By

Published : Jan 3, 2021, 8:52 AM IST

యూఏఈలో నివాసముంటున్న ఓ భారతీయుడు భారీ గ్రీటింగ్​ కార్డు నెలకొల్పారు. యూఏఈ పాలకుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్​ మొహమ్మద్​ బిన్​ రషీద్​ అల్​ మక్తౌమ్​ అధికారాన్ని చేపట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 8.2 చదరపు మీటర్ల భారీ గ్రీటింగ్​ కార్డును చెన్నైకి చెందిన రాంకుమార్​ సారంగపాణి రూపొందించి, ఆవిష్కరించినట్లు దుబాయ్​ మీడియా శనివారం వెల్లిడించింది. దీనిని షేక్​ మహమ్మద్​కు అంకితమిచ్చినట్లు తెలిపింది. తాజా రికార్డుతో రాంకుమార్​ ఖాతాలో 19 రికార్డులు చేరాయి.

యూఏఈ, భారత్​ల్లో అత్యధిక గిన్నిస్​ రికార్డులు నమోదు చేసిన వ్యక్తిగా రాంకుమార్​ నిలిచినట్లు ఇక్కడి మీడియా వివరించింది. ఈ కార్డులో దుబాయ్​ చిత్రకారుడు అక్బర్​ సాహెబ్​ గీసిన.. షేక్​ మొహమ్మద్​ చిత్రాలున్నట్లు పేర్కొంది. సాధారణ కార్డు కన్నా 100 రెట్లు పెద్దదిగా ఉన్నట్లు వివరించింది. గతంలో 6.729 చదరపు మీటర్ల గ్రీటింగ్​ కార్డు నెలకొల్పగా రాంకుమార్​ తాజాగా దానిని అధిగమించారు. 'ఆరు నెలలు శ్రమించి ఈ కార్డును రూపొందించాను. యూఏఈ 50వ జాతీయ దినోత్సవం సందర్భంగా దీనిని దేశానికి అంకితమిస్తున్నాను' అని రాంకుమార్​ తెలిపారు.

ఇదీ చూడండి: సౌదీలో బయటపడ్డ 2 లక్షల ఏళ్ల నాటి గొడ్డలి

ABOUT THE AUTHOR

...view details