తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్ క్షిపణులను కూల్చేసిన సిరియా! - ఇజ్రాయెల్ సిరియా వివాదం

తమదేశంపైకి ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణులను ధ్వంసం చేసినట్లు సిరియా ప్రకటించింది. లెబనాన్ భూభాగం మీదుగా ఈ దాడులు జరిగినట్లు పేర్కొంది.

Israel-Syria
ఇజ్రాయెల్ క్షిపణులను కూల్చేసిన సిరియా

By

Published : Jun 9, 2021, 9:34 AM IST

సిరియాలోని సైనిక ప్రదేశాలే లక్ష్యంగా మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసిందని సిరియా మీడియా తెలిపింది. అయితే వీటిలో కొన్ని క్షిపణులను కూల్చేసినట్లు సిరియా సైన్యం వెల్లడించింది. సిరియా రాజధాని డమాస్కస్​లో ప్రజలు చూస్తుండగానే ఈ దాడులు జరిగాయి.

ఎప్పటిలాగానే లెబనాన్ భూభాగం మీదుగా ఇజ్రాయెల్ ఈ దాడులకు తెగబడినట్టు సనా(ఎస్​ఏఎన్​ఏ) వార్తా సంస్థ తెలిపింది. సిరియాలోని లాటాకియా, సెంట్రల్​ ప్రావిన్స్​లోని కొందరు ఇజ్రాయెల్ దాడులను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారని చైనా అధికార మీడియా జిన్హువా నివేదించింది.

ABOUT THE AUTHOR

...view details