మోటార్ పడవల వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ఇటలీ రాజధాని వెనిస్లో నిరసనలు చేపట్టారు స్థానికులు. వీటి వినియోగం వల్ల రోజురోజుకూ నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పడవలు వేగంగా ఒడ్డుకు రావటం వల్ల ఏర్పడే అలల ధాటికి చారిత్రక కట్టడాలు ధ్వంసమవుతున్నాయని చెబుతున్నారు.
మోటార్ పడవల వినియోగం వద్దంటూ నీటిలో నిరసనలు - సెయింట్ మార్క్స్ స్క్వేర్ ఎదుట నీటి కొలను
ఇటలీ రాజధాని వెనీస్ నగరంలో ఇంజిన్తో నడిచే పడవలను ఉపయోగించటం వల్ల కాలుష్యం పెరిగిపోతుందంటూ ప్రజలు నిరసనలు చేపట్టారు. సెయింట్ మార్క్స్ స్క్వేర్ ఎదుట నీటి కొలనులో.. సాధారణ కాలుష్య రహిత పడవలు నడుపుతూ ఆందోళనలు చేశారు.
మోటార్ పడవల వినియోగం వద్దంటూ నీటిలో నిరసనలు
సెయింట్ మార్క్స్ స్క్వేర్ ఎదుటనున్న ఓ పెద్ద నీటికొలనులో పదుల సంఖ్యలో రోయింగ్ బోట్లతో శాంతియుతంగా తమ నిరసనలు తెలిపారు. క్రూయిజ్ పడవలు ఎక్కువగా వినియోగించటం వల్ల కాలుష్యం పెరిగిపోతోందని ప్లకార్డులను ప్రదర్శించారు.