తెలంగాణ

telangana

ETV Bharat / international

టర్కీ భూకంపంలో 114కు చేరిన మృతులు

టర్కీలో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 114కు చేరినట్లు టర్కీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. సహాయక చర్యలు పూర్తయినట్లు పేర్కొంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 8 వేల తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేయనున్నట్లు టర్కీ ప్రభుత్వం పేర్కొంది.

Death-toll-reaches-114-in-Turkeys-earthquake-rescue-operation-completed
టర్కీ భూకంపం - 114కు చేరిన మృతుల సంఖ్య

By

Published : Nov 4, 2020, 9:21 PM IST

టర్కీ భూకంపం ధాటికి కారణంగా ఇప్పటివరకు 114మంది ప్రాణాలు కోల్పోయినట్లు టర్కీ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. 1035 మంది గాయాల పాలైనట్లు వివరించింది. 137 మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు రాతపూర్వకంగా తెలిపింది. భూకంపం వల్ల టర్కీలోని మెట్రోపాలిటన్‌ నగరం ఇజ్మీర్‌లో 17 భవంతులు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుక్కున్న 107 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు పూర్తయినట్లు టర్కీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ ప్రతినిధి ట్విట్టర్‌ వేదికగా వివరించారు.

నిరాశ్రయులైనవారిని ఆదుకునేందుకు :

ప్రకృతి వైపరిత్యం నేపథ్యంలో నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ఇజ్మిర్‌ నగర మేయర్‌ సోయెర్‌ '‘వన్‌ రెంట్‌ వన్‌ హోమ్‌'’ పేరుతో ప్రచారం ప్రారంభించారు.

దీనికి ఆ దేశ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన ఐదు గంటల్లోనే 20 మిలియన్ల టర్కిష్‌ లిరా (దాదాపు రూ.1,75,00,000) సాయం అందినట్లు మేయర్‌ వివరించారు. ఈ సాయంతో 200 కుటుంబాలకు టెంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

ABOUT THE AUTHOR

...view details