దుబాయ్ ఎక్స్పో (Dubai Expo 2021).. యూఏఈ, దుబాయ్‌లతో భారత్‌కు ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ అవకాశాలకు వేదిక అని.. అన్ని రంగాల అభివృద్ధికి, పెట్టుబడులకు సరైన దేశమని పేర్కొన్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో భారత్ పెవిలియన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
'భారత్ ప్రతిభకు ప్రధాన కేంద్రం. టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్‌కు సంబంధించి మా దేశం ఎన్నో ఘనతలను సాధిస్తోంది. దిగ్గజ పరిశ్రమలు, అంకుర పరిశ్రమల మేళవింపే మా ఆర్థిక వృద్ధికి మూలం' అని అన్నారు మోదీ.