CJI NV Ramana: యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ.. శుక్రవారం దుబాయ్‌లోని గురుద్వారాను సందర్శించారు. ఆయన సతీమణి శివమాలతో కలిసి ప్రార్థనలు చేశారు.
గురుద్వారాలో జస్టిస్ ఎన్.వి.రమణ సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు.
భారత మధ్యవర్తిత్వ మండలి ఆధ్వర్యంలో నేడు (మార్చి 19) దుబాయ్‌లో జరిగే 'ప్రపంచీకరణ యుగంలో మధ్యవర్తిత్వం' అన్న సదస్సులో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పాల్గొననున్నారు.
గురువారం అబుదాబిలో జరిగిన పలు అధికారిక కార్యక్రమాల్లో సీజేఐ పాల్గొన్నారు. అక్కడి ప్రవాస భారతీయులు ఆయనను ఘనంగా సత్కరించారు.
ఇదీ చూడండి:'ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని, మాతృభాషను మరవొద్దు'