తెహ్రాన్‌లో ఉక్రెయిన్ విమానం కూలిపోవడానికి కారణం తమ సైన్యమే అని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 176 మంది చనిపోయిన ఈ ఘటనపై కెనడా, ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించాయి. ఉక్రెయిన్ విమానం కూలిపోవడానికి కారణమైన వారిని ఇరాన్ శిక్షించాలని, నష్టపరిహారం చెల్లించాలని ఆ దేశ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీ డిమాండ్ చేశారు. ఇరాన్.. దోషులను కోర్టుకు తరలిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఫేస్బుక్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జెలెన్స్కీ.
'ఇరాన్ జవాబుదారీతనంగా ఉండాలి' - Ukraine demands punishment, compensation for airliner downed by Iran
తెహ్రాన్‌లో విమాన ప్రమాదంపై కెనడా, ఉక్రెయిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి.
Canada's Trudeau demands 'accountability' after Iran plane admission
న్యాయం చేయాలి: కెనడా ప్రధాని
ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి పట్ల ఇరాన్ జవాబుదారీతనంగా ఉండాలన్నారు ప్రధాని జస్టిన్ ట్రూడో. బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. చనిపోయిన వారిలో కెనడా పౌరసత్వం ఉన్నవారు కూడా ఉన్నారన్నారు. ఆ ప్రమాదం జాతీయ విషాదమని పేర్కొన్నారు ట్రుడో. కెనడియన్లందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు.