తెలంగాణ

telangana

ETV Bharat / international

కుప్పకూలిన మూడంతస్తుల భవనం- ఐదుగురు మృతి - Accident in Egypt

ఈజిప్ట్​ అలెగ్జాండ్రియా నగరంలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో రెండు కుటుంబాలకు చెందిన 9 మంది ఉన్నట్లు సమచారం.

Building collapses in Egypt
కుప్పకూలిన మూడంతస్తుల భవనం

By

Published : Dec 3, 2020, 7:51 AM IST

ఈజిప్ట్​లోని అలెగ్జాండ్రియా నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. అందులో ఇద్దరు యువకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉంటారనే అనుమానంతో సహయక చర్యలు చేపట్టారు అధికారులు.

ప్రమాదం జరిగిన సమయంలో రెండు కుటుంబాలకు చెందిన 9 మంది భవనంలో ఉండిపోయినట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని అలెగ్జాండ్రియా గవర్నర్​ మొహమ్మద్​ ఎల్​ షరీప్​ తెలిపారు. ప్రమాదనికి గురైన భవనం 1940లో నిర్మించినదిగా పేర్కొన్నారు.

అయితే.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

భవనాలు కుప్పకూలటం ఈజిప్ట్​లో కొత్తేమి కాదు. ప్రతిఏటా ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. అలెగ్జాండ్రియా, కైరో వంటి పెద్ద నగరాల్లో స్థిరాస్తి వ్యాపారులు తమ ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా అదనపు అంతస్తులను కట్టడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో ఇటీవలే దేశవ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టింది అక్కడి ప్రభుత్వం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తోంది.

ఇదీ చూడండి: లైవ్ వీడియో: చెట్టు రూపంలో కమ్మేసిన మృత్యువు

ABOUT THE AUTHOR

...view details