గాజా నగరంలో పలు మీడియా సంస్థలున్న అతిపెద్ద భవంతిని ఇజ్రాయెల్ ధ్వంసం చేయడం పట్ల రష్యా ఆందోళన వ్యక్తంచేసింది. ఈ దాడిలో మృతుల సంఖ్యపై విచారం వ్యక్తంచేశారు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్. ఇటీవలి కాలంలో ఇరు పక్షాలతోనూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడలేదని, అయితే సమస్య పరిష్కారం కోసం సమావేశానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
వెంటనే ఆపాలి..
ఇజ్రాయెల్, పాలస్తీనా వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని ఈజిప్టు హెచ్చరించింది. ఇరు దేశాల సమస్యకు శాశ్వత, సమగ్ర, న్యాయమైన పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజంతో చర్చిస్తున్నట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రి సామే శుక్రీ వెల్లడించారు. ఈ ప్రాంతంలో యుద్ధం, విధ్వంసాన్ని అంతం చేయడానికి అమెరికా ముందుకొస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఆంక్షలకు మద్దతు..
ఇజ్రాయెల్‌పై ఆంక్షలకు మద్దతివ్వాలని పోప్ ఫ్రాన్సిస్‌కు విజ్ఞప్తిచేశారు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్. అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌ను శిక్షించనంతకాలం పాలస్తీనియన్ల ఊచకోత కొనసాగుతుందని అన్నారు.
ఇజ్రాయెల్‌కు మద్దతుగా..