తెలంగాణ

telangana

ETV Bharat / international

177మంది ప్రయాణికులు.. రెండు ముక్కలైన విమానం - latest plane crash news

టర్కీలో ఓ విమానం రెండు ముక్కలైంది. రన్​వేపై ల్యాండ్​ అవుతుండగా పక్కకు జారి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 177మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

plane-breaks-into-two
రన్​వేపై నుంచి జారి రెండు ముక్కలైన విమానం

By

Published : Feb 5, 2020, 10:23 PM IST

Updated : Feb 29, 2020, 8:14 AM IST

టర్కీలో ఓ విమానం ల్యాండయ్యే సమయంలో రన్‌వే నుంచి పక్కకు జారి రెండు ముక్కలైంది. పెగాసస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఇస్తాంబుల్‌లోని సబిహా గోకెన్‌ విమానశ్రయంలో కిందకు దిగే సమయంలో ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 177మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.

ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనకు ముందు ప్రచండ గాలులు వీచి వర్షం పడినట్లు తెలిపింది.

రన్​వేపై నుంచి జారి రెండు ముక్కలైన విమానం
Last Updated : Feb 29, 2020, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details