జోర్డాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. దేశ రాజధాని జర్కాలో సైన్యానికి చెందిన ఓ గిడ్డంగిలో శుక్రవారం ఉదయం పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరగిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వారు చెప్పారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రమాదస్థలం సహా చుట్టుపక్కల ఇతర ప్రాంతాల్ని అప్రమత్తం చేశారు. రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
కొంతకాలంగా గిడ్డంగిలో మోర్టార్ గుండ్లు నిల్వ ఉండగా.. ఇటీవలి కాలంలో అవి నిరుపయోగంగా మారాయి. అయితే.. ఇటీవల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అందులోని రసాయనాలు పేలాయని భద్రతా బలగాలు తెలిపాయి.