తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రతీకార చర్యకు సిద్ధంగా ఉండండి: ఇరాన్​ - ఇరాన్​పై రాకెట్​ దాడి

అమెరికా రాకెట్​దాడిలో తమ దేశ నిఘా విభాగాధిపతి మృతిపై ఇరాన్​ ప్రభుత్వం స్పందించింది. ఖాసీం సోలేమనీ మృతికి కారణమైన వారు ప్రతీకార చర్యలకు సిద్ధంగా ఉండాలని.. ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతొల్లా అలీ ఖమెనీ స్పష్టం చేశారు.

IRAN
ఖమెనీ

By

Published : Jan 3, 2020, 12:00 PM IST

అమెరికా జరిపిన వైమానిక దాడిలో తమ నిఘా విభాగాధిపతి ఖాసీం సోలేమనీ చనిపోవటంపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. ప్రతీకార దాడులు తప్పవని ఆ దేశ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమెనీ హెచ్చరించారు.

ఖాసీం సోలేమనీ..దేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన త్యాగధనుడని పార్సీ భాషలో ట్వీట్‌ చేశారు ఖమెనీ. దైవ సన్నిధికి చేరినా ఆయన చూపిన మార్గంలోనే పయనిస్తామన్నారు. ఖాసీంతోపాటు మరికొందరు అమరుల రక్తంతో చేతులు తడుపుకున్న నేరస్థులు ప్రతీకార దాడికి సిద్ధంగా ఉండాలని ఖమెనీ స్పష్టం చేశారు. ఖాసీం మృతి పట్ల 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. ఈ వార్త తెలిసిన వెంటనే ఇరాన్‌ ఉన్నతస్థాయి భద్రతా సంస్థ అత్యవసరంగా సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించింది.

ఇదీ చూడండి:'ట్రంప్​ ఆదేశాల మేరకే ఇరాక్​పై రాకెట్​ దాడి'

ABOUT THE AUTHOR

...view details