సిరియాలో ఘోరం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్నా ఓ బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ 'సన' వెల్లడించింది.
ప్రయాణికులతో కూడిన బస్సు బుధవారం దక్షిణ సిరియాలోని సెంట్రల్ హోమ్స్ రాష్ట్రం నుంచి డిర్ అజ్ జోర్ నగరానికి వెళ్తుండగా ఉగ్రదాడి జరిగినట్లు తెలిపింది. ఇందులో పలువురుకి గాయాలైనట్లు వివరించింది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిఉందని పేర్కొంది.