సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్‌పై వైమానిక దాడికి దిగాయి. జెట్ విమానాన్ని కూల్చడం వల్ల 31 మంది పౌరులు మృతిచెందారు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించింది. ఈ ఘటన యెమెన్ ఉత్తర ప్రావిన్స్‌లోని అల్ జాఫ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
యెమెన్‌లో సౌదీ వైమానిక దాడి.. 31 మంది మృతి - Airstrikes by a Saudi-led coalition
సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్‌లో రాకెట్ దాడులు చేశాయి. ఈ ఘటనలో ఓ జెట్ విమానం కూలిపోయి 31 మంది పౌరులు మృతి చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
యెమెన్‌లో సౌదీ వైమానిక దాడి
హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. అయితే అంతకుముందు రోజు యెమెన్‌లో సౌదీ జెట్ కూలిపోయింది. సౌదీ జెట్‌ను తామే కూల్చినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సౌదీ ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చూడండి:అద్భుతం: నాలుగేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి బతికింది..!
Last Updated : Mar 1, 2020, 12:01 PM IST