తెలంగాణ

telangana

ETV Bharat / international

రాకెట్​ దాడులతో దద్దరిల్లిన జెరూసలెం!

జెరూసలెంలో రాకెట్​ దాడులు కలకలం సృష్టించాయి. దాడికి సంబంధించి తొలుత సైరన్లు వినిపించాయని.. అనంతరం పేలుళ్లు సంభవించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జెరూసలెంలోని పాలస్తీనా వాసులపై పెరిగిపోతున్న ఇజ్రాయెల్ దుశ్చర్యలకు కళ్లె వేసేందుకే ఈ దాడులు జరిపినట్లు హమాస్ ప్రకటించింది.

erusalem tensions
జెరూసలెంలో వైమానిక దాడులు..

By

Published : May 10, 2021, 10:03 PM IST

రాకెట్​ దాడులతో జెరూసలెం దద్దరిల్లింది. అల్​-అక్సా మసీదు ప్రాంగణాన్ని ఇజ్రాయెల్ బలగాలు ఖాళీ చేయాల్సిందిగా గాజాలోని హమాస్ మిలిటెంట్​ గ్రూప్ గడువు విధించిన కొద్దిసేపటికే ఈ పేలుళ్లు సంభవించడం గమనార్హం. ఈ దాడులకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ బాధ్యత వహించింది. జెరూసలెంలోని పాలస్తీనా వాసులపై ఇజ్రాయెల్ ఆగడాలకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేపట్టినట్లు హమాస్ ప్రతినిధి అబూ ఓబీడా వెల్లడించారు. ఈ సందేశాన్ని శత్రువు బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని.. ఇజ్రాయెల్​ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అల్-అక్సా మసీదును ఇజ్రాయెల్ ఆక్రమించుకోవాలని చూసినా.. తూర్పు జెరూసలెం పరిసరాల్లోని పాలస్తీనా ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించేదుకు ప్రయత్నించినా మరిన్ని దాడులు తప్పవని హమాస్ ప్రతినిధి హెచ్చరికలు జారీచేశారు.

ఈ దాడుల్లో గాయపడిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారి గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

ఇవీ చదవండి:జెరూసలెంలో ఘర్షణలు- 200 మందికి గాయాలు!

ABOUT THE AUTHOR

...view details