కరోనా నిబంధనలపై నిర్లక్ష్యం వహించిన ఎయిర్ఇండియా విమానాలపై దుబాయ్ పౌర విమానయాన శాఖ వేటు వేసింది. అక్టోబర్ 2 వరకు ఈ విమానాల రాకలపై నిషేధం విధించింది. కొవిడ్ పాజిటివ్ ధ్రువపత్రాలు కలిగినా కూడా గడిచిన రెండు వారాల్లో ఇద్దరు ప్రయాణికులను తీసుకొచ్చిందని పేర్కొంది.
కరోనా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది దుబాయ్ ప్రభుత్వం. అక్టోబర్ 2 వరకు ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వాధికారులు శుక్రవారం వెల్లడించారు.
రెండోసారి..
"సెప్టెంబర్ 2వ తేదీన పాజిటివ్‌గా నిర్ధరణ అయిన ఓ ప్రయాణికుడు సెప్టెంబర్ 4న ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో జైపుర్ నుంచి దుబాయ్ చేరుకున్నాడు. గడిచిన రెండు వారాల్లో ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి" అని ఓ అధికారి తెలిపారు.