సరైన వీసాలు, పాస్‌పోర్టులు కలిగి ఉన్న అఫ్గానీయులకు తమ దేశాన్ని వీడేందుకు అనుమతిస్తామని (Afghanistan Taliban) తాలిబన్ల ప్రతినిధి మౌలావీ హఫీజ్ మన్సూర్ తెలిపారు. మజారే షరీఫ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం ఆయన మాట్లాడారు. అమెరికన్లతో పాటు ఇక్కడి నుంచి బయల్దేరేందుకు సిద్ధమైన అఫ్గాన్‌వాసులను తాలిబన్లు (Afghanistan Taliban) అడ్డుకున్నారనే వార్తలపై స్పందిస్తూ.. ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న చాలామంది అఫ్గాన్ పౌరులకు( (Afghanistan news) సరైన వీసాలు, పాస్‌పోర్టులు లేవని చెప్పారు. అయితే ఎంతమంది వద్ద లేవోనన్న వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
Afghanistan Taliban: 'సరైన పత్రాలుంటే.. వారికి అనుమతి' - అఫ్గానిస్థాన్ వార్తలు తాజా
సరైన పత్రాలు ఉన్న అఫ్గానీలను దేశాన్ని వీడి వెళ్లేందుకు అనుమతిస్తామని తాలిబన్లు (Afghanistan Taliban) స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న చాలామంది అఫ్గాన్ పౌరులకు సరైన వీసాలు, పాస్‌పోర్టులు లేవని పేర్కొన్నారు.
![Afghanistan Taliban: 'సరైన పత్రాలుంటే.. వారికి అనుమతి' taliban on evacuation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13000635-thumbnail-3x2-taliban.jpg)
మరోవైపు, మజారే షరీఫ్‌లో తమ విమానాలను తాలిబన్లు అడ్డుకున్నట్లు వచ్చిన వార్తలను అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు. ఖతార్‌లో ఆయన మాట్లాడుతూ.. సరైన పత్రాలున్నవారిని సురక్షితంగా పంపిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామన్నారు. అమెరికా ప్రస్తుతం అఫ్గాన్‌లో(Afghanistan US Troops) మిగిలిపోయిన తమ దేశ ప్రజలను, ఇతరులను తరలించాలనే ఒత్తిడిలో ఉంది. ఈ విషయంలో తాలిబన్లతో కలిసి పనిచేస్తామని ఇదివరకే ప్రకటించింది.
ఇదీ చూడండి :అఫ్గాన్ నుంచి పౌరుల తరలింపునకు అమెరికా కొత్త స్కెచ్