దశాబ్దాల సంఘర్షణ తరువాత.. అఫ్గానిస్థాన్, తాలిబన్ల మధ్య శాశ్వత శాంతి కోసం మరోసారి అడుగులు పడ్డాయి. ఖతార్ రాజధాని దోహాలో అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో హాజరయ్యారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా, తాలిబన్ మధ్య కుదిరిన భద్రతా ఒప్పందంలో భాగంగా ఈ చర్చలను నిర్వహిస్తున్నారు. చర్చలు సఫలమైతే అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు నిష్క్రమించేందుకు మార్గం సుగమవుతుంది.