హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య పరస్పర వైమానిక దాడులతో గాజా నగరం దద్దరిల్లుతోంది. సోమవారం రాత్రి నుంచి వందలాది రాకెట్లు ఈ ప్రాంతంలోని అనేక భవనాలను నేలమట్టం చేయగా.. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన 10మంది బలవ్వగా.. ఆరు నెలల శిశువు మాత్రం మృత్యుంజయుడిగా నిలిచాడు.
"రంజాన్ పర్వదినాన్ని బంధువులతో కలసి జరుపుకునేందుకు భార్య, ఐదుగురు పిల్లలతో కలసి ఇక్కడికి వచ్చా. నా భార్య, 6-14 సంవత్సరాల వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలు మరణించారు. నా 11ఏళ్ల కొడుకు కనిపించటం లేదు. నా ఆరు నెలల కుమారుడు ఒమర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు."
-మహ్మద్ హదీది, శిశువు తండ్రి