లెబనాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధన ట్యాంకర్ పేలిపోయి.. 20 మంది మృతి చెందారు. మరో 79 మంది గాయాలపాలయ్యారు. దక్షిణ లెబనాన్‌లోని తేలి గ్రామంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఘటనపై స్పందించిన లెబనాన్ ఆరోగ్య మంత్రి హమద్ హసన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
లెబనాన్ ఇప్పటికే ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఇంధన అక్రమ రవాణా, నగదు కొరతలతో ప్రభుత్వంపై విమర్శలు ఎదురైతున్న ప్రస్తుత సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన తేలి గ్రామం సిరియా సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ఇంధనాన్ని సిరియాకు అక్రమంగా తరలించే ప్రయత్నంలో ఈ ఘటన జరిగిందా? అనే అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.