అఫ్గానిస్థాన్‌లోని చోమ్టల్, బలా బొలొక్ జిల్లాల్లో ప్రభుత్వం జరిపిన వైమానిక దాడుల్లో 15 మంది తాలిబన్లు హతమయ్యారు. బలా బొలొక్ జిల్లాలో గురువారం జరిపిన దాడుల్లో 8 మంది మృతిచెందారు. చోమ్టల్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిపిన దాడుల్లో మరో ఏడుగురు హతమయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ ట్విట్టర్లో వెల్లడించింది.
'బలా బొలొక్ జిల్లా ఫరా రాష్ట్రంలో గురువారం రాత్రి జరిపిన దాడుల్లో 8 మంది తాలిబన్లు హతమయ్యారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
చోమ్టల్ జిల్లా బల్క్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం జరిపిన దాడుల్లో ఏడుగురు తాలిబన్లు మృతిచెందారు. 5 మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో వారి ఆయుధాలు కూడా నాశనమయ్యాయి.'
-అఫ్గానిస్థాన్ రక్షణ శాఖ