యెమెన్లో తిరుగుబాటుదారులు, ప్రభుత్వ మద్దతుదారులకు జరిగిన భీకర ఘర్షణల్లో(Yemen news) 44 మంది ప్రాణాలు కోల్పోయారు. చమురు నిల్వలకు ప్రసిద్ధి చెందిన దక్షిణ రాష్ట్రం మారిబ్లో జరిగిన దాడుల్లో 28 మంది తిరుగుబాటుదారులు మృతి చెందగా.. ప్రభుత్వ మద్దతుదారులు 16 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ నియంత్రణలో పలు ప్రాంతాలపై రెబల్స్.. డ్రోన్లు, క్షిపణి దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. అందుకు దీటుగా హౌతీ నియంత్రణలో ఉన్న ప్రాంతాలు, మారిబ్ పశ్చిమ భాగంలో ఉన్న తిరుగుబాటుదారులే లక్ష్యంగా ప్రభుత్వ బలగాలు వైమానిక దాడులను నిర్వహించారని పేర్కొన్నారు.
దాడులు ఎందుకు?