ఇరాక్ అన్బర్ రాష్ట్రంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై రెండు రాకెట్ దాడులు జరిగాయి. అయితే ఖాళీగా ఉన్న అయాన్ అల్ అసద్ వైమానిక స్థావరంపై జరిగిన ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఇరాక్ మిలటరీ తెలిపింది.
ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై రాకెట్ దాడులు - అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్ దాడి
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్ దాడులు జరిగాయి. అన్బర్ రాష్ట్రంలోని అయాన్ అల్ అసద్ వైమానిక స్థావరంపై ఈ దాడి జరిగినట్లు ఇరాక్ సైన్యం తెలిపింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించింది.
రాకెట్ దాడి
అల్ బియాదేర్ అనే గ్రామం నుంచి ఈ రాకెట్ దాడులు జరిగినట్లుగా ఇరాక్ సైన్యం పేర్కొంది. కాగా దాడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. ఈ దాడికి ముందు రోజు కూడా బలద్ ఎయిర్ బేస్‌పై మూడు సార్లు రాకెట్ దాడులు జరిగాయి.
ఇదీ చదవండి:టీకాల విషయంలో భారత్‌పై కొరియా సెటైర్!