Houthis killed: యెమెన్లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు.. హౌతీ తిరుగుబాటుదారులపై దాడులు జరిపాయి. ఈ ఘటనలో 190 మంది హౌతీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ప్రభుత్వ దళాలు శనివారం తెలిపాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఈ దాడులు జరిపినట్లు చెప్పాయి.
మరిబ్ రాష్ట్రంలోని హౌతీ స్థావరాలపై 24 గంటల వ్యవధిలో 36 ఆపరేషన్లు చేపట్టినట్లు సౌదీ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. ఈ ఆపరేషన్లలో హౌతీలకు చెందిన 20 సైనిక వాహనాలు, డ్రోన్ నియంత్రణ యూనిట్లు ధ్వంసమయ్యాయని చెప్పింది.
దాడులు ఎందుకు?
Yemen News: 2014లో ఇరాన్ మద్దతుతో హౌతీలు.. రాజధాని సనాను చేజిక్కించుకున్నప్పటి నుంచి యెమెన్లో అంతర్యుద్ధం మొదలైంది. సనా సహా దేశంలోని ఉత్తర భాగాన్ని హౌతీలు హస్తగతం చేసుకున్నారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం తొలుత దక్షిణాది రాష్ట్రాలకు, ఆ తర్వాత సౌదీ అరేబియాకు తరలిపోవాల్సి వచ్చింది.
Yemen Humanitarian Crisis: ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా మద్దతుతో సౌదీ నేతృత్వంలోని కూటమి 2015 మార్చిలో యుద్ధంలోకి ప్రవేశించింది. హౌతీ స్థావరాలపై అనేక సార్లు వైమానిక దాడులు జరిపింది. ఇరు పక్షాల పరస్పర దాడులతో యెమెన్లో తీవ్రమైన మానవతా సంక్షోభం ఏర్పడింది.
ఇదీ చూడండి:మసీదులో దాచిన ఆయుధాలు పేలి 12 మంది మృతి