దుబాయ్‌లోని భారత సంతతికి చెందిన 12ఏళ్ల సిద్ధాంత్ గుంబర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వర్డల్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. కేవలం ఒకే నిమిషంలో 39 విమాన సర్వీసు సంస్థల చిహ్నాలను గుర్తించి ఔరా అనిపించాడు. చకచకా చెప్పి గిన్నిస్ బుక్‌లో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
హరియాణాకు చెందిన గుంబర్ గతంలో 'ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు సంపాదించాడు. ఇంతకుముందు.. అతి చిన్న వయసులోనే ప్రపంచంలోని అతిపెద్ద భవంతులను, వాటి ప్రదేశాలను గుర్తుంచుకొని చెప్పడం విశేషం. ఇటీవల జరిగిన 'ఎయిర్‌ప్లేన్ టైల్' క్విజ్‌తో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు.