తెలంగాణ

telangana

ETV Bharat / international

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్​- 11 మంది మృతి - ఆర్మీ విమానం కూలి 10 మంది మృతి

టర్కీలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది సైనికులు మరణించారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

10 killed in army helicopter crash in eastern Turkey
హెలికాప్టర్​ ప్రమాదంలో 11 మంది మృతి

By

Published : Mar 5, 2021, 1:28 AM IST

Updated : Mar 5, 2021, 6:28 AM IST

తూర్పు టర్కీలో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ గురువారం కూలిపోయింది. దీంతో ఇందులో ఉన్న 11 మంది సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బాధితుల్లో ఒక ఉన్నత స్థాయి అధికారి ఉన్నారని సమాచారం.

కుప్పుకూలిన ఆర్మీ హెలికాప్టర్

అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:25 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా ఉండే సీక్మీస్​ గ్రామానికి సమీపంలో హెలికాప్టర్​ కూలిపోయనట్లు గుర్తించారు. బింగోల్ నుంచి తత్వాన్కు ప్రాంతానికి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.

కుప్పుకూలిన ఆర్మీ హెలికాప్టర్

ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది. మంచు, దట్టమైన పొగ కారణంగా హెలికాప్టర్ కూలి ఉంటుందని అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: 'భారత విదేశీ విధానంలో బంగ్లాదేశ్​కు సముచిత స్థానం'

Last Updated : Mar 5, 2021, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details