తెలంగాణ

telangana

ETV Bharat / international

హౌతీ దాడులు.. సౌదీ చమురు డిపోలో మంటలు - హౌతీ దాడులు.

Yemen rebels strike oil depot in Saudi: సౌదీ అరేబియాలోని యెమెన్​ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. జెడ్డా నగరంలోని ఓ చమురు డిపోను పేల్చేశారు. ఆదివారం నుంచి జెడ్డాలో ఫార్ములా వన్ రేస్ పోటీలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి దాడి జరగడంపై సర్వత్రా చర్చనీయాంశం అయింది.

Yemen rebels strike oil depo
Yemen rebels strike oil depo

By

Published : Mar 26, 2022, 5:01 AM IST

Yemen rebels strike oil depot in Saudi: సౌదీ అరేబియాలోని జిద్దాలో చమురు డిపోపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. ఫార్ములా వన్‌ రేసింగ్‌ జెడ్డా నగరం ఆథిత్యం ఇస్తుండగా ఆ ప్రాంతంలోని భారీ చమురు నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.

ఈ దాడిలో రెండు భారీ ఇంధన ట్యాంకులు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు. ప్రాణనష్టం తప్పిందని.. పేర్కొన్నారు. సౌదీ అరేబియా ఆర్థికవ్యవస్థలో కీలకమైన చమురు ఉత్పత్తులను ధ్వంసంచేసి ఆర్థికంగా నష్టపరచాలనే తిరుగుబాటుదారులు.. ఇంధన నిల్వలను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు.

రియాద్‌ సమీప ప్రాంతాల్లోనూ విద్యుత్‌స్టేషన్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు సౌదీ మీడియా వెల్లడించింది.ఈదాడుల్లో ఇళ్లు, వాహనాలు ధ్వంసమైనట్లు తెలిపింది.మరోవైపు ఆదివారం జరగనున్న ఎఫ్‌-1 రేసింగ్‌ను ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. రేసింగ్‌కు వచ్చిన అతిథుల భద్రతకు తాము అధిక ప్రాధన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. దానికోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

2020 నవంబర్‌లోనూ ఇదే చమురు నిల్వ కేంద్రంపై హౌతీ తిరుగుబాటుదారులు దాడికి చేశారు. మరోవైపు సౌదీలో హౌతీ తిరుగుబాటు దారుల దాడులను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఖండించారు. ఈ చర్యలు పౌరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తాయని ట్వీట్‌చేశారు.

ఇదీ చూడండి:'ఉక్రెయిన్​ యుద్ధంలో తొలిదశ పూర్తి.. అదే మా లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details