తెలంగాణ

telangana

ETV Bharat / international

1,100 ఏళ్ల నాటి బైబిల్.. రూ.300 కోట్లకు వేలం.. స్పెషల్​ ఏంటంటే? - 1100 ఏళ్ల నాటి బైబిల్​ వేలం

కోడెక్స్ సాసూన్.. అనే హిబ్రూ బైబిల్‌ ప్రపంచంలోనే అతి పురాతనమైన బైబిల్‌లలో ఒకటి. 11 వందల ఏళ్ల నాటి ఈ బైబిల్‌ను అమెరికాలోని న్యూయార్క్‌లో అమ్మకానికి పెడితే 300 కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది. చేతితో రాసిన ఈ బైబిల్‌.. వేలంలో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు అంటున్నారు.

Worlds oldest Hebrew Bible
Worlds oldest Hebrew Bible

By

Published : May 18, 2023, 8:20 PM IST

అమెరికాలోని న్యూయార్క్‌లో 11 వందల ఏళ్ల నాటి హిబ్రూ బైబిల్.. వేలంలో దాదాపు 313 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. చేతితో రాసిన ఈ బైబిల్‌ ప్రపంచంలోని అత్యంత పురాతన బైబిల్‌లలో ఒకటిగా ఖ్యాతినార్జించింది. కోడెక్స్ సాసూన్ అనే ఈ హిబ్రూ బైబిల్‌ను రొమేనియాలోని మాజీ U.S. రాయబారి ఆల్ఫ్రెడ్ H. మోసెస్ కొనుగోలు చేశారు. ANU మ్యూజియం అమెరికా స్నేహితుల తరఫున ఆయన దీనిని కొనుగోలు చేశారు. ఇజ్రాయెల్‌ టెల్ అవీవ్‌లోని ANU మ్యూజియం ఆఫ్ జ్యూయిష్ పీపుల్‌కు ఈ బైబిల్‌ను విరాళంగా ఇచ్చారు. వేలానికి ముందు ప్రపంచ పర్యటనలో భాగంగా గత మార్చిలో ANU మ్యూజియంలో ఈ బైబిల్‌ను ప్రదర్శనకు ఉంచారు.

వేలంలో అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఈ బైబిల్‌ ఒకటని నిర్వహకులు తెలిపారు. రాతపత్రుల్లో 2021లో అమెరికా రాజ్యాంగం దాదాపు 400 కోట్ల రూపాయలకుపైగా ధర పలికింది. లియోనార్డో డా విన్సీ రాసిన కోడెక్స్ లీసెస్టర్.. 1994లో జరిగిన వేలంలో అప్పట్లోనే 300 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడైంది. కోడెక్స్ సాసూన్ త్వరలోనే ఇజ్రాయెల్‌కు శాశ్వతంగా తిరిగి రానుందని నిర్వాహకులు వెల్లడించారు.

1100 ఏళ్ల నాటి బైబిల్​
1100 ఏళ్ల నాటి బైబిల్​

కోడెక్స్ సాసూన్ అనే బైబిల్‌ను క్రీస్తు శకం 880 నుంచి 960 మధ్య కాలంలో రాసి ఉంటారని చరిత్రకారులు అంటున్నారు. 1929లో ఇరాక్‌కు చెందిన యూదు వ్యాపారవేత్త కుమారుడు డేవిడ్ సోలమన్ సాసూన్.. ఈ బైబిల్‌ను కొనుగోలు చేయడం వల్ల దీనికి కోడెక్స్ సాసూన్ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు తెలిపారు. అతడు మరణించిన తర్వాత 1978లో స్విట్జర్లాండ్‌ జ్యూరిచ్‌లోని సోత్‌బీ.. బ్రిటీష్ రైల్ పెన్షన్ ఫండ్‌కు దాదాపు 1.4 మిలియన్‌ డాలర్లకు ఈ బైబిల్‌ను విక్రయించారని తెలిపారు. పెన్షన్ ఫండ్.. కోడెక్స్ సాసూన్‌ బైబిల్‌ను 11 సంవత్సరాల తర్వాత జాక్వి సఫ్రాకు 7.7 మిలియన్‌ డాలర్లకు విక్రయించింది. దీనిని జాక్వి సఫ్రా ఇప్పుడు విక్రయించారు.

1100 ఏళ్ల నాటి బైబిల్​
1100 ఏళ్ల నాటి బైబిల్​

పాత ఐఫోన్​కు రూ.52 లక్షలు
ఇటీవలె 2007లో కొన్న ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ మోడల్​ను వేలం వేయగా రికార్డు ధరకు అమ్ముడిపోయింది. అమెరికాలో ఈ ఫోన్​ను వేలం వేయగా రూ.52లక్షలకు (63వేల డాలర్లు) అమ్ముడుపోయింది. ఎల్​సీజీ హౌస్​ వేసిన వేలం పాటలో ఈ పాత ఫోన్​ను కొనేందుకు ఎగబడ్డారు. ఇన్వెస్టర్లు, పాత ఫోన్లు సేకరించే వారు పెద్ద ఎత్తున ఈ వేలంలో పాల్గొన్నారు. 50వేల డాలర్లు వస్తాయని ముందుగా అంచనా వేయగా.. ఈ ఫోన్ ఏకంగా 63 వేల డాలర్లకు పైగా రాబట్టింది.ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి :హిందూ మహాసముద్రంలో చైనా షిప్​ గల్లంతు.. ఓడలో 39 మంది!.. డ్రాగన్​కు భారత్​ సాయం

ముంబయి పేలుళ్ల నిందితుడు రాణాకు షాక్.. భారత్​కు అప్పగించాలని అమెరికా కోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details